నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలములోని జుక్కల్, ఖండేబల్లుర్ గ్రామాలలో కామారెడ్డి జిల్లా, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, మండల ప్రత్యేక అధికారి శ్రీ బి. చందర్ నాయక్ జుక్కల్ మండలం జిల్లా పరిషత్ పాఠశాల, ఖండేబల్లూర్ జిల్లా పరిషత్ పాఠశాల, కేజీబీవీ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ప్రత్యేక అధికారులతో పలు అంశంల పై సమావేశం నిర్వహించనైనది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ప్రత్యేక కార్యనిర్వానదకారి చందర్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ మరియు కేజీబీవీ ప్రధానోపాధ్యాయులతో విద్యార్థులతో పదవ తరగతి ఫలితాలు మెరుగు పరుచుట విషయంలో చర్చించనైనది. అదేవిధంగా ఐకెపి అధికారులు, సిబ్బందితో బ్యాంక్ ఋణాలు, ఇందిరమ్మ ఇళ్లు ఋణాలు మంజూరి విషయంలో అడిగి తెలుసుకున్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది తో లేబర్ టర్న్ అవుట్ గురించి చర్చించారు. ఇందిరమ్మ ఇళ్లు మార్కౌట్ ఇచ్చుట గురించి జుక్కల్ మండల ఎంపీడీవో తో శ్రీనివాస్ తో పాటు సిబ్బందితొ మండలంలోని పలు గ్రామాల జిపి కార్యదర్శులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యార్థులకు, ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహార అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యనిర్వాహణాధికారి చందర్ నాయక్ తో పాటు జుక్కల్ మండల ఎంపీడీవో శ్రీనివాస్, ఖండేబల్లూర్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్ హెచ్ఎం లాలయ్య , జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావు క్లస్టర్ హెచ్ఎం మరియు కేజీబీవీ ప్రత్యేక అధికారిని , సంబంధిత గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు , తదితరులు పాల్గొన్నారు.




