Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైభవంగా ముక్కోటి ఏకాదశి 

వైభవంగా ముక్కోటి ఏకాదశి 

- Advertisement -

ఉత్తర ద్వారా దర్శనం
నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామి వారి ఉత్సవ మూర్తులను పురవీధులలో ఊరేగించారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవమూర్తులకు ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ,శశిరేఖ, రామడుగు అశ్విన్ శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు, పుష్పార్చనలు చేశారు.

అనంతరం వార్షిక ఏకాదశి సప్తమ మహా యజ్ఞం, పూర్ణాహుతి జరిపారు. తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. అనంతరం సామూహిక విష్ణు సహస్రనామం పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మీలా వేణుమాధవ్, పావని, కడవేరు మల్లికార్జున్, కృష్ణవేణి, రెడ్డిపల్లి సైదులు, సైదమ్మ, కొంపెల్లి లక్ష్మయ్య, మంగమ్మ, చేగోని సైదులు లక్ష్మి, పోగుల చంద్రయ్య పూలమ్మ దంపతులు బండారు అరుణ్ కుమార్ కోమటి భాస్కర్, కాపుగంటి గోపి, కొల్లూరి శివ,వోరుగంటి రమేష్, గుండు రూప, గుడిపాటి పద్మ,ఈపూరి ధనలక్ష్మి, ఈపూరి రమ్య, అండాలు, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -