Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదరంగం ఆటతో చురుకుదనం 

చదరంగం ఆటతో చురుకుదనం 

- Advertisement -

• సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ 
నవతెలంగాణ -పెద్దవంగర
చదరంగం ఆటతో పిల్లల్లో చురుకుదనం, మేథో సంపత్తి పెరుగుతుందని పెద్దవంగర సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్, చెస్ నెట్వర్క్ ప్రతినిధి రాజేశ్వర్ అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలంగాణ చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గాదె గోపాల్ రెడ్డి ఆర్థిక సహకారంతో పాఠశాలలకు ఉచితంగా చెస్ బోర్డులు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో బుదారపు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మెదడుకు పదును పెట్టేందుకు చదరంగం క్రీడ ఎంతగానో దోహదపడుతుందన్నారు.

వ్యాయామంతో శారీరక దృఢత్వం పెరిగితే, చెస్ క్రీడతో మేథో శక్తి పెరుగుతుందన్నారు. ఆధునిక యుగంలో యువత సెల్ ఫోన్ కు బానిసలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. చదరంగం క్రీడ అభ్యాసంతో మానసిక దృఢత్వం, ఏకాగ్రత, స్వీయ నియంత్రణ అలవడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు అవసరమైతే తప్ప సెల్ ఫోన్ వినియోగించవద్దని, చెస్ వైపు అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సిరి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఏదునూరి శ్రీనివాస్, ఉపసర్పంచ్ వినోద్, హెచ్ఎంలు కళాధర్, శేషవల్లి, రవీందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్, చిరంజీవి, వేణు, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ చెస్ నెట్వర్క్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -