Tuesday, December 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

బట్టుపల్లి అనురాధ 
నవతెలంగాణ – ఆలేరు రూరల్ 

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వ,) 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభలు కరపత్రాన్ని ఆలేరు మండల కేంద్రమైన కాటమయ్య నగర్ లో ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టు పెళ్లి అనురాధ మహిళలతో కరపత్రాన్ని ఆలేరులో మంగళవారం విడుదల చేయడం జరిగింది. నాలుగు రోజులపాటు జరిగే ఈ మహాసభలు దేశ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు చర్చించి రూపొందించబోయే భవిష్యత్తు కార్యచరణ మహిళ ఉద్యమాలకు దిశనిర్దేశం చేయనున్నది అని ఆమె అన్నారు.

శ్రేయోభిలాషులు పెద్దలు ప్రజలందరూ ఆర్థిక హర్థిక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.జాతీయ సంఘమైన ఐద్వా మహిళల సమాన హక్కులను కాపాడుకోవాలని అన్నారు.విద్య బాల్యవివాహాల నిషేధం ఆస్తి హక్కు చట్టం వరకట్న వేధింపుల నిరోధానికి ఐపిసి 498 ఏ సెక్షన్ కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్లు ఏర్పాటు చేయాలని అన్నారు.గృహహింస నిరోధక చట్టం పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు తదితరుల మహత్తరమైన పోరాటాలు చేసి సాధించుకుంది అన్నారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడి దానిని నిలువరించడంతో పాటు లక్షల సంఖ్యలు ఉన్న ఇంటి పని వారిని సంఘటితపరిచి స్నేహ ఇంటి పనివారల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి కనీస వేతన చట్టం సాధించి పని హక్కు ఆహార భద్రత మద్యం ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయాలని తదితర అంశాలపై వేలాది మంది మహిళలను కూడగట్టి హక్కులను సాధించుకుంది అని అన్నారు.నేడు అన్ని రంగాల్లో మహిళలు ముందుండి పోరాటాలు చేయాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు.

ఐద్వా మహిళా సంఘం మండల నాయకులు అయిలి చంద్రకళ,మొరిగాడి స్వరూప,గణగాని భాగ్యమ్మ,దుడుక ఉమా,మొరిగాడి రాజమ్మ,కడవెర్గు ఉ, బేతి పద్మ,ఎలగందుల పద్మ,వెంగల్ దాస్, సత్యలక్ష్మి,మొరిగాడి లత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -