నవతెలంగాణ – మెండోర
వెల్గటూర్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి సీనియర్ లెవల్ వేదిక్ మ్యాథ్స్, అబాకస్ పోటీలలో లిటిల్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి టైటిల్ కైవసం చేసుకున్నారని పాఠశాల కరస్పాండెంట్ అజ్మత్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయి సీనియర్ లెవల్ వేదిక్ మ్యాథ్స్, అబాకస్ లో మా విద్యార్థులు టైటిల్ కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. వేదిక్ మ్యాథ్స్ విభాగంలో మనిదీప్ 9 వ తరగతి విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడని తెలిపారు. మనిదీప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఇది రెండవసారి అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అబాకస్ సీనియర్ లెవెల్ విభాగంలో ఉసికెల హన్విత 4వ తరగతి , హన్విక 5వ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ అజ్మత్ పాష పాఠశాల ఉపాధ్యాయిని ఉపాద్యాయులు అభినందించారు.
జిల్లా టైటిల్ కైవసం చేసుకున్న వెల్గటూర్ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు
- Advertisement -
- Advertisement -



