యాదగిరిగుట్ట మండల సర్పంచుల ఫోరం ఎన్నిక
అధ్యక్షుడిగా మంగ సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కళ్లెం జహంగీర్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు డిసిసి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య సూచించారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలం సర్పంచుల ఫోరం ఎన్నిక ఆయన సమక్షంలో నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మల్లాపురం సర్పంచ్ మంగ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా మాసాయిపేట సర్పంచ్ కళ్లెం జహంగీర్ విజయ గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వంగపల్లి సర్పంచ్ ఒగ్గు రవళి, సహాయ కార్యదర్శిగా చిన్న గౌరాయపల్లి సర్పంచ్ బోగ లక్ష్మీనారాయణలు, కోశాధికారిగా లప్పనాయక్ తండ సర్పంచ్ గాశిరాం నాయక్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం గ్రామాలలో అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే సంక్షేమ పథకాలు గడపగడపకు అందే విధంగా చూడాలని సూచించారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బీర్ల శంకర్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల నాయకులు దుంబాల వెంకటరెడ్డి, సర్పంచులు చిన్నం మమత శ్రీనివాస్, పారునంది కృష్ణ, కాల్నే సరిత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



