Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యూయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్సై సుధాకర్

న్యూయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్సై సుధాకర్

- Advertisement -

నవతెలంగాణ – టేకుమట్ల 
ముందస్తుగా టేకుమట్ల మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి టేకుమట్ల ఎస్సై దాసరి సుధాకర్ అన్నారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల వరకు వ్యాపారస్తులు, కేకులు విక్రయించే బేకరీ షాపులు ముందస్తుగానే మూసివేయాలని ఆయన సూచించారు. యువకులు మద్యం సేవించి రోడ్డుపైకి రావద్దని, వీధుల్లో, గ్రామ సెంటర్లలో బహిరంగంగా కేకులు కట్ చేయొద్దు తెలిపారు. ఎవరి ఇంట్లో వారే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. రాత్రి పోలీసులు రైడింగ్ లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల్లో డీజే ఉపయోగించరాదని తెలిపారు. 31 అర్ధరాత్రి గ్రామాలలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తామని తెలిపారు. అల్లర్లు, ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -