- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బంటు ప్రకాష్ (50) కువైట్‌లో మృతి చెందాడు. గత పదేళ్లుగా ఉపాధి నిమిత్తం కువైట్‌లో నివసిస్తున్న ఆయన డిసెంబర్ 27 శనివారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య బంటు లక్ష్మి, కుమారుడు బంటు త్రిజాల్ ఉన్నారు. ప్రకాష్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
- Advertisement -



