Wednesday, December 31, 2025
E-PAPER
Homeఖమ్మంమళ్ళీ యూరియా కోసం క్యూ లైన్లు

మళ్ళీ యూరియా కోసం క్యూ లైన్లు

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోనే ముష్టికుంట్ల సహకార సంఘంలో యూరియా కోసం మహిళా రైతులే క్యూ కట్టిన సంఘటన సంచలనం గా మారింది. రైతుల మధ్య వివాదం కారణంగా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసిన సంఘటన మండల పరిధిలోని ముష్టికుంట సహకార సంఘం లో మంగళవారం జరిగింది. ముష్టికుంట సహకార సంఘానికి రెండు దఫాలుగా యూరియా వచ్చింది. రెండు రోజుల క్రితం రైతులు యూరియా కోసం తెల్లవారుజామున నాలుగు గంటలకే వచ్చి సహకార సంఘం వద్ద రైతుల క్యూ కట్టారు. అయితే రైతుల మధ్య వివాదంతో పాటు అదే రోజు మరో 20 టన్నుల యూరియా వస్తుందని మొత్తం కలిపి మరుసటి రోజు యూరియా పంపిణీ చేస్తామని సహకార సంఘాధికారులు వాయిదా వేశారు.

ఆ వాయిదా ప్రకారం మరుసటి రోజు క్యూలో ఉన్న రైతులందరికీ కూపన్లు పంపిణీ చేశారు. ఆ కూపన్లు ఆధారంగా మంగళవారం యూరియా పంపిణీ చేశారు. తెల్లవారుజాము నుంచే మహిళా రైతులు సహకార సంఘం వద్ద క్యూ కట్టారు. అయితే ఈ క్యూలో యూరియా తీసుకున్న రైతుల కూడా ఉండటం విశేషం. మొదట సారి యూరియా కోసం వచ్చి క్యూలో నిలబడ్డ మహిళలు అంతకుముందు యూరియా తీసుకుపోయిన మహిళలు కూడా ఉండటంతో వివాదం ప్రారంభమైంది. ఇది చిలికి చిలికి గాలి వానలా చివరకు యూరియా పంపిణీ వాయిదా పడే వరకు వెళ్ళింది. ఒకసారి తీసుకెళ్లిన రైతులకు మరల ఇవ్వటానికి ఇవ్వలేదని ముందుగా అసలు తీసుకొని రైతులకే యూరియా ఇవ్వాలని మహిళా రైతులు రైతులు పట్టుపట్టారు. ఒక దేశలో మహిళా రైతుల మధ్య దూషణల పర్వం కూడా కొనసాగింది. దీంతో వివాదం ముదురుతుండటంతో పాటు అంతకుముందు ఇచ్చిన  కూపన్లు కూడా అయిపోవటంతో పంపిణీ కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేశారు. 

ముష్టికుంట్ల సొసైటీలో యూరియా కొరత లేదు:  సొసైటీ సి ఈ ఓ కొండా రాంబాబు
ఈ విషయంపై ఆ సంఘం సీఈఓ కొండా రాంబాబుని వివరణ కోరగా ముందుగా రైతులకు కూపన్లు ఇచ్చి వాటి ఆధారంగా యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే మంగళవారం కూడా అంతకుముందు రోజు యూరియా తీసుకెళ్లిన రైతులు వచ్చి మరల క్యూలో నిలబడ్డారని, దీనివలన వివాదం ఏర్పడిందని తెలిపారు. అంతకుముందు తీసుకున్న రైతులకి అసలు తీసుకొని రైతులకు మధ్య వివాదం ఏర్పడటం వలన కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ప్రస్తుతం పంపిణీ చేయగా ఇంకా 1173 కట్టలు సొసైటీలో ఉన్నట్లు తెలిపాడు. ముందుగా రైతులకు కూపన్లు పంపిణీ చేసి వాటి ఆధారంగా యూరియాను  రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ముష్టికుంట సహకార సంఘంలో యూరియా కొరతలేదని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను సొసైటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయటానికి సొసైటీ అధ్యక్షులు బోయినపల్లి వెంకటేశ్వర్లు, అధికారులు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -