Wednesday, December 31, 2025
E-PAPER
Homeసినిమాపక్కా మాస్‌ బీట్‌ సాంగ్‌

పక్కా మాస్‌ బీట్‌ సాంగ్‌

- Advertisement -

చిరంజీవి, వెంకటేష్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలోని థర్డ్‌ సింగిల్‌ మెగా విక్టరీ మాస్‌ని రిలీజ్‌ చేశారు. సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో పండుగ పల్స్‌, డ్యాన్స్‌-ఫ్లోర్‌ ఎనర్జీతో నిండిన మరో అద్భుతమైన ట్రాక్‌ను అందించారు. నక్ష్‌ అజీజ్‌, విశాల్‌ దద్లాని పవర్‌ ఫుల్‌ వోకల్స్‌ అందిస్తూ పాటలో ఎనర్జీ నింపారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం పక్కా మాస్‌ టచ్‌తో పాటు నాస్టాల్జియా ఫీల్‌ని మేళవించి, ఈ స్టార్‌ స్టడెడ్‌ రీయూనియన్‌కి పర్ఫెక్ట్‌గా నిలిచింది.
చిరంజీవి మెగాస్టార్‌ ఆరా, వెంకటేష్‌ క్లాసీ చార్మ్‌ కలిసి ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా వుంది. కొరియోగ్రాఫర్‌ విజరు పోలకి హై-వోల్టేజ్‌ స్టెప్పులతో పాట ఎనర్జీని మరింత పెంచారు. చిరంజీవి ట్రేడ్‌మార్క్‌ గ్రేస్‌, వెంకీ కూల్‌ స్టైల్‌.. ప్రతి బీట్‌ పండుగ ఉత్సాహాన్ని తాకేలా వుంది.
నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అర్చన ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్‌ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘విజ్ఞాన్‌ యూనివర్సిటీకి ఎంతోమంది గెస్ట్ల్సు వస్తుంటారు, పోతుంటారు. అనిల్‌ రావిపూడి లోకల్‌( నవ్వుతూ). మిమ్మల్ని అందరిని మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు చాలా ఈవెంట్లకు ఇక్కడ వచ్చాను. ఫస్ట్‌ టైం నా సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే కాలేజీలో ఇంజనీరింగ్‌ పాస్‌ అయి, తెలుగు సినిమా ఇండిస్టీకి వెళ్లి ఈరోజు మీ ముందు డైరెక్టర్‌గా నిలబడ్డాను. విజ్ఞాన్‌ మహౌత్సవం ఈవెంట్‌లో నేను ఫస్ట్‌ టైం ఒక స్కిట్‌ని డైరెక్ట్‌ చేశాను. నిజంగా ఆ ఈవెంట్‌ లేకపోతే నేను డైరెక్షన్‌ వైపు వెళ్లే వాడినే కాదు. కాలేజ్‌ అనేది ఎడ్యుకేషన్‌ మాత్రమే కాదు మన లక్ష్యాన్ని చూపిస్తుంది. దానికి ఎగ్జాంపుల్‌ నేనే. ఇది నా తొమ్మిదో సినిమా. చాలా స్పెషల్‌ ఫిల్మ్‌. నేను చిన్నప్పుడు నుంచి తెలుగు సినిమా స్టార్స్‌ని చూస్తూ పెరిగాను. చిరంజీవి, బాలకష్ణ, వెంకటేష్‌, నాగార్జున ఈ నలుగురు సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళని ఎలా డైరెక్ట్‌ చేయాలని ఒక డ్రీమ్‌ ఉండేది. వెంకటేష్‌, బాలకష్ణ, ఇప్పుడు బెస్ట్‌ ఆపర్చునిటీ మెగాస్టార్‌తో వచ్చింది. స్కూల్‌ డేస్‌లో నేను ఆయన పాటలకి డ్యాన్స్‌ చేసేవాడిని. అలాంటి హీరో సినిమాకి డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం, అలాగే నాకు ఇష్టమైన జోనర్లో సినిమా చేయడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది’ అని అన్నారు.
– సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ అనిల్‌ రావుపూడి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -