విజరు హీరోగా నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయకుడు’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘ఒక పేరే అలరారు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. పాటకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి అని చిత్రయూనిట్ తెలిపింది.
అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని ఈ పాటను తెలుగులో శ్రీనివాస మౌళి రాయగా, శ్రీకష్ణ, విశాల్ మిశ్రా ఆలపించారు. పాటలోని బలమైన సాహిత్యం దానికి తగ్గ బీట్ అందరినీ మెప్పిస్తోంది. తన అభిమానులతో దళపతి విజరుకి ఉన్న గాఢమైన అనుబంధాన్ని ఈ పాట ద్వారా వ్యక్తం చేశారు. అన్నీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో పాట దూసుకెళ్తోంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ కావటం ఓ ప్రత్యేకత. అలాగే విజరు కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీ అని మేకర్స్ చెప్పారు.
సంక్రాంతి బరిలో ‘జన నాయకుడు’
- Advertisement -
- Advertisement -



