- Advertisement -
ఐదు అంచెల్లో క్రీడా పోటీల నిర్వహణ
నవతెలంగాణ – హైదరాబాద్ : 2026 సీఎం కప్ పోటీలను జవనరి 17 నుంచి నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. తొలుత సీఎం కప్‌ను మూడు అంచెల్లో నిర్వహించగా.. నిరుడు పోటీలను నాలుగు అంచెల్లో నిర్వహించారు. ఈసారి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు సహా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ క్రీడా పోటీలు షెడ్యూల్ చేశారు. సీఎం కప్ పోటీలను విజయవంతం చేసేందుకు జిల్లా యువజన, క్రీడాభివృద్ది అధికారులతో శాట్జ్ చైర్మెన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాల దేవి మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. జనవరి 8-11 వరకు జిల్లా కేంద్రాల్లో క్రీడా జ్యోతి కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు.
- Advertisement -



