గాజాపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో జరిగిన సమావేశంలో ట్రంప్ అసహనం
ఫ్లోరిడా : గాజాపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో జరిగిన సమావేశం మధ్యలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన దౌత్య యత్నాలను ఎవరూ గుర్తించడం లేదని ఆయన కినుక వహించారు. నెతన్యాహూతో విందుకు ట్రంప్ కూర్చోగా రెండు దేశాల ప్రతినిధి బృందాలు చర్చలు కొనసాగించాయి. ఈ సమావేశానికి సంబంధించిన దృశ్యాల వీడియో వైరల్ అవడంతో ట్రంప్ అసహనం బయటపడింది. తన ప్రయత్నాలjఱ తగిన గౌరవం లభించడం లేదని ట్రంప్ అనడం విన్పించింది. ‘ముప్ఫై ఐదు సంవత్సరాలు పోరాడారు. వారు ఇప్పుడు దానిని ఆపేశారు. ఆ క్రెడిట్ నాకు వచ్చిందా? లేదు’ అని ఆయన కస్సుబుస్సులాడారు. ఆయన పరోక్షంగా నోబెల్ బహుమతిని ప్రస్తావించినట్లు అర్థమవుతోంది. ఈ సమావేశంలో ట్రంప్ తన విజయాలను ఏకరువు పెట్టారు. ఘర్షణలను నివారించడంలో విజయం సాధించానని చెప్పుకున్నారు. భారత్, పాక్ ఘర్షణను ఆయన మరోసారి ప్రస్తావించారు. ఘర్షణల నివారణలో ఎనిమిది విజయాలు తనవేనని అన్నారు. ఆ తర్వాత విలేకరులు అక్కడ ఉండడాన్ని గమనించిన ట్రంప్ తన స్వరాన్ని తగ్గించి మాట మార్చారు. సమావేశం అనంతరం ట్రంప్‌పై నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. చర్చలు ఫలప్రదంగా సాగాయని, తామిద్దరి మధ్య అసాధారణ స్నేహం ఉన్నదని చెప్పారు. ట్రంప్‌కు ఇజ్రాయిల్ వార్షిక బహుమతిని ప్రదానం చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయిలీ కాని వారికి ఈ బహుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి.
నా విజయాలను ఎవరూ గుర్తించడం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



