Wednesday, December 31, 2025
E-PAPER
Homeక్రైమ్ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం

- Advertisement -

ఏడుగురి మృతి
అల్మోరా :
ఉత్తరాఖండ్‌లో ఒక బస్సు లోయలోపడిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 12 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం 9 గంటలకు అల్మోరా నుంచి నైనిటాల్‌ జిల్లాలోని రామ్‌నగర్‌కు బయలుదేరి ఒక ప్రయివేటు బస్సు కొద్ది సేపటికే ప్రమాదానికి గురయింది. అల్మోరా శివారుల్లోని 200 మీటర్ల లోతుగా ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. తీవ్రంగా గాయపడినవారిలో ముగ్గుర్ని ఎయిమ్స్‌ రిషికేళ్‌కు తరలించారు. మరో ముగ్గుర్ని రామ్‌నగర్‌కు పంపారు.
మిగిలిన వారికి భికియాసైన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి మీడియాకు ఎస్‌పీ దేవేందర్‌ పించా మీడియాకు వివరిస్తూ రోడ్డుపై ఒక మలుపు వద్ద రహదారికి 200 మీటర్ల దిగువన ఉన్న లోయలో బస్సు పడిపోయిందని తెలిపారు. డ్రైవర్‌ మలుపు నుంచి బస్సును పక్కకు తిప్పలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్టు తెలిపారు. దీనిపై విచారణ కోసం అధికారుల్ని ఆదేశించినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -