Wednesday, December 31, 2025
E-PAPER
Homeజాతీయంబర్త్‌డే పార్టీపై భజరంగ్‌దళ్‌ గూండాల దాడి

బర్త్‌డే పార్టీపై భజరంగ్‌దళ్‌ గూండాల దాడి

- Advertisement -

– చంపేస్తామంటూ బెదిరింపులు
– ఐదుగురు అరెస్టు
బరేలీ :
ఉత్తరప్రదేశ్‌ బరేలీలో ఒక కేఫ్‌లో జరుగుతున్న పుట్టినరోజు పార్టీపై భజరంగ్‌దళ్‌ గూండాలు దాడిచేశారు. ఆ పార్టీలో ఇద్దరు ముస్లిం బాలురు వున్నారని, ఇది లవ్‌ జిహాద్‌ అంటూ పుట్టినరోజు జరుపుకుంటున్న బాలికతో సహా వచ్చిన అతిథులపై దాడి చేశారు. ఈనెల 27న జరిగిన ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఒక మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రిషబ్‌ థాకూర్‌ పరారీలో వున్నాడని పోలీసులు చెప్పారు. కేఫ్‌లోకి బలవంతంగా చొరబడిన కొంతమంది వ్యక్తులు సిబ్బందిపై, కస్టమర్లపై దూషణలకు దిగుతూ, వారిపై దాడి చేశారని, ఆ ఆవరణను ధ్వంసం చేశారని, ఎవరైనా అడ్డు చెబితే చంపుతామని బెదిరించారని ప్రేమ్‌నగర్‌ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రిషబ్‌ థాకూర్‌, దీపక్‌ పాథక్‌ల ఆదేశాల మేరకే ఈ రభస చోటు చేసుకుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -