– విద్యార్థి అమరుల స్ఫూర్తిని కొనసాగిద్దాం.. : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు
– ఘనంగా ఓయూలో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
విద్యార్థి అమరుల స్ఫూర్తితో విద్యారంగాన్ని కాపాడుకుందామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి అజరు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెండా ఆవిష్కరణ చేశారు. ఓయూ రీసెర్చ్ స్కాలర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి తదితరులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలతో ఏర్పడిన ఎస్‌ఎఫ్‌ఐ 56 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యారంగాన్ని ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ నుంచి రక్షించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతోందన్నారు. దేశం సంపదనను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను అడ్డుకునేందుకు నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం ఎస్‌ఎఫ్‌ఐ చేస్తోందని, అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా ఎస్‌ఎఫ్‌ఐ అనే మూడు అక్షరాల జెండా రెపరెపలాడుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని పూర్తిగా ప్రయివేటుకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందని, దీని వల్ల ప్రభుత్వ విద్య వ్యవస్థ నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు రెడ్ కార్పెట్ పరచడం ద్వారా దేశ విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. విద్యారంగం ప్రయివేటు కార్పొరేట్ శక్తుల ఆధీనంలోనే ఉందని, విద్యాశాఖ మంత్రి లేకుండానే రాష్ట్ర విద్యా వ్యవస్థ నడుస్తోందని అన్నారు. విద్యారంగ భవిష్యత్ ప్రమాదంలో పడుతున్న ఈ సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణలో విద్యార్థులు భాగస్వాములై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి అజరు, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్, ఓయూ ఉపాధ్యక్షులు కిరణ్, సహాయ కార్యదర్శి మనోజ్, యూనివర్సిటీ నాయకులు తరుణ్, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా కాషాయికరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రతిజ్ఞ : రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్‌లో జెండావిష్కరణ
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్ జెండావిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ.వెంకటేశ్‌లు మాట్లాడారు. 1970 ఆవిర్భావం నుంచి నేటి వరకు విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని కొనియాడారు. ఎస్‌ఎఫ్‌ఐ జెండాను నిలబెట్టడంతో 277 మంది విద్యార్థులు అమరులయ్యారని అన్నారు. తాము చేసిన పోరాటాల ద్వారా సాధించిన విద్యా హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆందోళనల వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం. 2020 పేరుతో విద్యారంగంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేయడానికి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు 2025 తీసుకొచ్చి కార్పొరేట్ వ్యాపారులకు అప్పగించడం ద్వారా కాషాయీకరణ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంందని విమర్శిం చారు. యూజీసీ రద్దుచేసి ఒకే గొడుగు కిందికి విద్యను తీసుకురావడాన్ని అడ్డుకుంటామని హెచ్చ రించారు. విద్యాకాషాయికరణ, వ్యాపారీ కరణకు వ్యతిరేకంగా బలమైన విద్యార్థి ఉద్యమాలను నిర్మిస్తా మని స్పష్టం చేశారు. నిరుద్యోగులు, విద్యా ర్థులు, మహిళలు, కార్మికులు, దళితులు, ఆదివాసి, గిరిజన సమస్యలతో పాటు సామాజిక రుగ్మతలు, పీడనకు వ్యతిరేకంగా సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిం చామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో విద్యార్థి హక్కులపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. అశోక్ రెడ్డి. రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేర, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్, అరవింద్, నాయకులు శ్రీమన్, నాగేందర్ ,ప్రశాంత్ రజినీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..
విద్యారంగాన్ని కాపాడుకుందాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



