– మండల పశువైద్యాధికారి అభిలాస్
నవతెలంగాణ – మల్హర్ రావు
జీవాలకు నట్టల నివారణ మందు తప్పనిసరిగా తాగించాలని,జీవాలకు వచ్చే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని తాడిచెర్ల పశువైద్యాధికారి అబిలాస్ రైతులకు సూచిస్తున్నారు.నట్టల నివారణకు శిబిరాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి 7 వరకు కొనసాగుతుందని తెలిపారు.మండలంలోని మల్లారం, చిన్నతూoడ్ల, వళ్లెంకుంట, కొయ్యుర్, ఇప్పలపల్లి, కొండంపేట, రుద్రారం, ఎడ్లపల్లి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు, దుడ్డేలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసినట్లుగా పేర్కొన్నారు. బుధవారం నుంచి తాడిచెర్ల, పెద్దతూoడ్ల, ఆన్ సాన్ పల్లి, నాచారం, మల్లంపల్లి గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. మండలంలో గొర్రెలు 21,560, మేకలు 15,10 ఉండగా, మొత్తం 30,338 ఉన్నట్లుగా తెలిపారు. ఇందులో ఇప్పటికే 7,209 పశువులకు నట్టల మందు వేసినట్లుగా పేర్కొన్నారు. మిగతా వాటికి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆయా గ్రామాల్లో శిబిరాలను నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు.
పశువులకు నట్టల నివారణ మందు తప్పనిసరి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



