Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస కొత్తూర్ లో డంపింగ్ యార్డ్  కోసం స్థల పరిశీలన

హాస కొత్తూర్ లో డంపింగ్ యార్డ్  కోసం స్థల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని హాసాకొత్తూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ కోసం బుధవారం స్థల పరిశీలన చేసినట్లు సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కోసం సేకరించిన స్థలాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలోని ఇందిరమ్మ కాలనినీ పట్టి పీడిస్తున్న డంప్ యార్డు తరలింపు సమస్యకు మోక్షం లభించిందన్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న డంపింగ్ యార్డ్ బావి ఉన్న  మారుతి నగర్ ఇందిరమ్మ కాలనీలో కొన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. డంపింగ్ యార్డ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తరచు నిప్పు పెట్టడంతో అక్కడి ప్రజలు కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నూతనంగా డంపింగ్ యార్డ్ కోసం స్థలం సేకరించిన నేపథ్యంలో వర్షకాలంలో మారుతి నగర్ ప్రజలు పడుతున్న బాధలకు ముగింపు లభించినట్లు సర్పంచ్ గంగారెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం డంపింగ్ యార్డ్ గా ఉపయోగిస్తున్న బావిని పూర్తిగా పూడి చేసి, శాశ్వత పరిష్కారం చూడాలని కాలనీ వాసులు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను కోరారు.డంప్ యార్డు తరలింపు కోసం నిర్ణయం తీసుకున్న గ్రామ సర్పంచ్ నలిమెల గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్ రెడ్డి, పాలక వర్గానికి జేసీఐ, ఇంపాక్ట్ సభ్యులు, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -