Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భువనగిరిలో ఎన్నికల ముందే డబల్ బెడ్ రూమ్ లు లబ్ధిదారులకు ఇవ్వాలి

భువనగిరిలో ఎన్నికల ముందే డబల్ బెడ్ రూమ్ లు లబ్ధిదారులకు ఇవ్వాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టిపల్లి అనురాధ
నవతెలంగాణ – భువనగిరి
 భువనగిరి పట్టణ కమిటీ సమావేశానికి పట్టణ కార్యవర్గ సభ్యుడు బందెల ఎల్లయ్య అధ్యక్షత వహించారు. సింగన్నగూడెం బైపాస్ దగ్గర 444 నాలుగు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎన్నికల ముందు పంపిణీ చేసినారు. ఇంతవరకు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం అధికారుల పాలకులది అని రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాట్లాడుతూ.. బట్టుపల్లి అనురాధ అన్నారు. డబల్ బెడ్రూంలో మొదలుపెట్టి ఎనిమిది సంవత్సరాలు దాటుతున్న అవి స్థిల వ్యవస్థలకు చేరినవి ఎన్నికల ముందు హడావుడి చేసి ఇండ్ల నెంబర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రెండు సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు పాలకులు అధికారులు ఉన్నారు.

అదేవిధంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో ఇంటిగ్రేడ్ మార్కెట్ కట్టి మూడు సంవత్సరాలు అవుతున్న చిరు వ్యాపారులకు ఇవ్వాలని రోడ్లపై ఫుట్పాత్ లేకుండా చేస్తామన్నారు. ఈ చిన్న రోడ్లలో యాక్సిడెంట్లు అవుతున్నాయని రోడ్లపై ఫుట్పాత్లు ఎత్తివేస్తామని చిరు వ్యాపారులకు అందర్నీ ఒకే దగ్గరికి చేర్చి వ్యాపారాలు కొనసాగించాలని గత ప్రభుత్వాలు తెలిపారు. అయినా ఇప్పటివరకు వ్యాపార లకు అందించలేని పరిస్థితి భువనగిరి పట్టణంలో ఇరువైపులా ఫుట్ పాత్ పై టైల్స్ వేస్తున్నారు. అవి నాణ్యత లేకుండా ఒక క్రమ పద్ధతిలో వేయడం లేదన్నారు. రెండు మూడు నెలలు అవుతున్నా ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నవిపట్టణంలోని మెయిన్ రోడ్లలో వర్షం వస్తే జగదేపూర్ చౌరస్తా, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, కాలేజ్ గ్రౌండ్ నీరు నిలిచి చెరువు లాగా మారుతున్నయన్నారు.

అండర్ డ్రైనేజీ కట్టిన అవి సరిగ్గా రంద్రాలు లేక వర్షపు నీరు వెళ్లకుండా రోడ్లపై నిలిచి ఉంటున్నవి అంబేద్కర్ చౌరస్తా వద్ద సిగ్నల్స్ కూడా పనిచేయడం లేదు అన్ని చౌరస్తాలలో పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది పెట్టాలని విచ్చలవిడిగా బైపాస్ లో  వర్క్స్ బోర్డ్ ప్రభుత్వము ఎస్సీలకు బీసీలకు వ్యవసాయ  భూముల లో ప్లాట్లు చేసి 15,20 ఫీట్లు రోడ్లు మాత్రమే చేసి అమ్ముకుంటున్నారన్నారు. దాంట్లో పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్న మున్సిపల్ అధికారులు చూడి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ష మున్సిపల్ అధికారులు వారి కింద ఉన్న సూపర్వైజర్ లను అసిస్టెంట్లను పెట్టుకొని అనేక డబ్బులు వసూలు చేస్తున్నారు. మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు  ఇరువైపులా పర్మిషన్ లేకుండా అనేక ఇండ్లు నిర్మిస్తున్నారన్నారు.  ఈ సమస్యలపై సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు  నిర్వహిస్తామని పట్టణ కమిటీ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య, వనం రాజు, కమిటీ సభ్యులు బర్ల వెంకటేష్,  వలదాస్ అంజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -