Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ పెద్దల సమక్షంలో భూ కబ్జా వివాదం పరిష్కారం

గ్రామ పెద్దల సమక్షంలో భూ కబ్జా వివాదం పరిష్కారం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామంలో గల ప్రభుత్వ భూమిలో ఒకరు ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు ఎంపీడీవో కు ఆ గ్రామస్తులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎంపీడీవో రాణి బుధవారం నాడు రాచూర్ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామ సర్పంచ్ లోకండే ఆకాష్ ఉప సర్పంచ్ సిండికే మారుతి. ఆ గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాజు పటేల్, గ్రామ కార్యదర్శి రవీందర్, గ్రామ పెద్దలు విట్టల్ రావు, సమక్షంలో భూ కబ్జా సమస్య పరిష్కారం కోసం ఎంపీడీవో విచారించగా గ్రామస్తులంతా ఏకతాటిగా ఎలాంటి భూకబ్జా లేకుండ గ్రామంలోని పురాతనమైన ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ స్థలాన్ని గ్రామస్తులంతా కలిసి వివాదం లేకుండా ఒక వ్యక్తి భూ కబ్జా చేశారు. దానిమీద పాత ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ స్థలం రాబోయే రోజుల్లో కొత్త గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కోసం అప్పగించడానికి ఎంపీడీవోకు గ్రామస్తుల సంతకాలతో రాసి ఇచ్చారు. గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా ఎలాంటి గొడవలకు తావు లేకుండా కలిసిమెలిసి ఉండాలని ఎంపీడీవో రాణి గ్రామస్తులను కోరారు భూ కబ్జా వివాదం పరిష్కారంలో గ్రామ పెద్దలు రాజు పటేల్, శంకర్ పటేల్ ముఖ్య పాత్ర పోషించినట్లు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -