- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికునిగా ఏండ్ల తరబడి పనిచేస్తూ డిసెంబర్ 31న పదవి విరమణ పొందారు. విట్టల్ అనే కార్మికుడు పదవి విరమణ పొందగా ఆయన దంపతులకు సర్పంచ్ దంపతులైన ఉషా సంతోష్ మేస్త్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుని సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఏండ్ల తరబడి పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తూ గ్రామ శుభ్రతలో తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు పనిచేయడం గ్రామ శుభ్రత పనుల్లో ఆయన సేవలు అమూల్యముగా పేర్కొన్నారు. కార్మికుడి పదవీ విరమణ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, ఎంపీడీవో కార్యాలయ అధికారులుచ పంచాయతీ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



