– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి
బుధవారం జిల్లా కేంద్రంలోని బాలసదనంలో నివసిస్తున్న చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారులతో కలసి సహపంక్తి భోజనం చేసి, వారి సంక్షేమం పట్ల జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. బాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించిన జిల్లా కలెక్టర్ వారు పెద్దయ్యాక ఏమవుతారో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల సమాధానాలను ఆనందంగా స్వీకరించి, వారి కలలు నెరవేరేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా 134.9 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణాన్ని పరిశీలించి అన్ని హంగులతో మార్చి లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ట్రైనీ రవితేజ, డి డబ్ల్యూ ఓ ప్రమీల, ఈ ఈ పి ఆర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, సంబంధిత అధికారులు, బాలసదనం సిబ్బంది పాల్గొన్నారు.
బాలసదనం చిన్నారులతో నూతన సంవత్సర వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



