నవతెలంగాణ – జన్నారం
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అధిక లాభం కలుగుతుందని జన్నారం మండలంలోని జన్నారం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారినీ మల్యాల త్రిసంధ్య అన్నారు. బుధవారం మండలం లోని జన్నారం క్లస్టర్ పరిధి లోని లింగయ్య పల్లి గ్రామంలో NMNF (న్యాచురల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫామింగ్) పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన సాగు ఖర్చు తగ్గడం, భూమి సారాన్ని పెంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం, భూమి సారవంతంగా ఎండిపోకుండా ఉండడం, పర్యావరణాన్ని కాపాడడం వలన రైతులు అధిక లాభాలు పొందుతారని అన్నారు. అలాగే వరి పంటకు బదులు ఆయిల్ పామ్, పప్పు దినుసులు, మొక్కజొన్న వంటి పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగయ్యపల్లి సర్పంచ్ కొత్తపల్లి వనిత శ్రీనివాస్, ఉప సర్పంచ్ పిండి నరేష్ కృషి సఖి జక్కుల రజిత,,వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అధిక లాభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



