Wednesday, December 31, 2025
E-PAPER
Homeఖమ్మంపిల్లల్లో మార్పును కోరే కథా సంపుటి స్నేహం

పిల్లల్లో మార్పును కోరే కథా సంపుటి స్నేహం

- Advertisement -

– ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

అత్యంత విలువలు కలిగి సామాజిక మార్పును కోరే కథా సంపుటి “స్నేహం”  అని మండల విద్యాధికారి పి.ప్రసాదరావు అన్నారు. అశ్వారావుపేట కు చెందిన ప్రముఖ బాల కథా రచయిత సిద్ధాంతపు సాత్విక్ వ్రాసిన స్నేహం కథా సంపుటిని స్థానిక సూర్య స్కూల్ లో ప్రిన్సిపాల్ పోతన రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కథా రచయితగా సాత్విక్ ఉత్తమ కథలను సమాజానికి అందించాడని విలువైన విశ్లేషణతో పిల్లల్లో ,సమాజంలో మార్పును కోరుతూ ప్రతీ కథా ఆదర్శవంతంగా ఉన్నాయని స్నేహం కథా సంపుటి ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని ప్రతీ ఒక్కరూ చదవ దగిన కథల పుస్తకాన్ని రచించిన సాత్విక్ అభినందనీయుడని అన్నారు. 

సూర్య స్కూల్ ప్రిన్సిపాల్ పోతన రాంబాబు మాట్లాడుతూ సాత్విక్ అత్యంత క్రమశిక్షణ గల విద్యార్ధిగా ఉంటూ చిన్నప్పటి నుండి రచనా శైలిని అలవర్చుకుని బాల రచయితగా, చిత్రకారునిగా రాణిస్తూ చదువులో కూడా ముందువరుసలో ఉంటూ అందరికీ ఆదర్శవంతంగా నిలిచాడని అన్నారు.అనంతరం సాత్విక్ ని పాఠశాల యాజమాన్యం,అతిధి లు సత్కరించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు గోవిందరాజులు, శ్యాం బాబు, మల్లికార్జునరావు, సాత్విక్ తండ్రి ప్రభాకరాచార్యులు, సూర్య స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -