Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందె భాస్కర్ కు అందిన హ్యాట్రిక్  ఆహ్వానం 

అందె భాస్కర్ కు అందిన హ్యాట్రిక్  ఆహ్వానం 

- Advertisement -

– గల్లి నుండి విదేశాల దాకా పిలుపు రావడం సిద్దిపేట జిల్లాకు ఎంత గర్వకారణం 
నవతెలంగాణ – మిరుదొడ్డి
 దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్ ను. తెలంగాణ మట్టి కళారూపం డప్పు ధ్వనికి రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామానికి చెందిన అందే భాస్కర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్  అవార్డు  గ్రహీత డప్పు బృందానికి వరుసగా మూడోసారి తెలంగాణ కళారూపాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఎంతో సంతోషకరమని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్  అవార్డు  గ్రహీత అందె భాస్కర్ అన్నారు.

ఈ యొక్క అవకాశాన్ని పంపినవారు సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ నాగపూర్ వారు. ఈ ప్రోగ్రాం లో భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇక్కడ మన తెలంగాణ మారుమూల ప్రాంత డప్పు దరువు మళ్లీ ఢిల్లీలో వినిపించే అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి వీరందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -