నవతెలంగాణ-దర్పల్లి
ఇటీవల స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన మండలంలోని అయ్యాగ్రామాల సర్పంచులకు మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా చెలిమేల శ్రీనివాస్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా గాదె నరేష్ చల్లగర్గా, క్యాషియర్ జి. కావ్య మైలారం, జనరల్ సెక్రెట్రిగా కట్టా గంగమోహన్ వాడి, కార్యదర్శి మేగవత్ అరుణ మద్దుల్ తండా గార్లు ఎన్నికైనట్లు, కొత్తగా ఎన్నికైన సభ్యులు తెలిపారు. ఈసందర్బంగా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సర్పంచుల సమస్యల సాధనకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమములో అయ్యాగ్రామాల కాంగ్రేస్ పార్టీ సర్పంచిలు మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, నాయకులు మనోహర్ రెడ్డి,మిట్టపల్లి గంగారెడ్డి, పుప్పాల సుభాష్, చెలిమేల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా : చెలిమేల శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



