నవతెలంగాణ – మునుగోడు: ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి అండగా ఉంటానని పలివెల 6 వార్డు సభ్యులు ఆనగంటి కృష్ణ అన్నారు. బుధవారం ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు పలకలు , పెన్నులతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు వ్యవస్థను అరికట్టడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో బలోవేతానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆదే సత్యనారాయణ ఉయ్యాల సోమయ్య , ఉప సర్పంచ్ చెరుకు సునీత సైదులు , వార్డు సభ్యులు కొండూరి మాధవి, బత్తుల శేఖర్, గోసుకొండ మల్లేష్ , నాయకులు దాడి జితేందర్ రెడ్డి, సొల్లేటి నరసింహ చారి, రాజేందర్ రెడ్డి, రాము, శ్రీనివాసు, మల్లయ్య తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



