నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి నలంద పాఠశాల విద్యార్థులు విశ్వం ఎడ్యుటెక్ అధ్వర్యంలో విజయలక్ష్మి గార్డెన్స్ లో నిర్వహించిన అబాకస్ జిల్లాస్థాయిపరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనపరిచినారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణను ఇచ్చినటువంటి అబాకస్ ఉపాధ్యాయులు స్వరూప, శివాని లను పాఠశాల యాజమాన్యం బుధవారం కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ లు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ పాఠశాలకు చెందిన ఋగ్వేద మూడవ తరగతి విద్యార్థిని రాష్ట్రస్థాయిలో జూనియర్ విజువలైజేషన్ ఛాంపియన్ లెవెల్ -1 కి ఎంపిక కావడం గర్వంగా ఉందని తెలిపారు.
ఈ అబాకస్ తరగతుల వలన విద్యార్థులలో గణితం పై భయం వీడి, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. నలంద విద్యార్థులకు ఐఐటి, ఒలంపియాడ్ కాంపిటీషన్ పరీక్షలు, జిల్లాస్థాయి అబాకస్ పరీక్షలలో విద్యార్థులు పాల్గొని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచడం నలంద విద్యార్థులకే సాధ్యమని యాజమాన్యం తెలిపారు. ఇలాంటి కాంపిటీషన్ పరీక్షలకు సహకరిస్తున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు , విశ్వం ఎడ్యుటెక్ సీ.ఈ.ఓ వినయ్ కి, మండల ఇంచార్జ్ గగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఒకటి నుండి మూడో తరగతి విద్యార్థులు కన్సోలేషన్ మెమొంటోలు, ప్రశంస పత్రాలు అందుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.



