నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామంలో బుధవారం పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ బాణావత్ లలిత రాములు ముఖ్యఅతిథిగా పాల్గొని నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, పలు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ ద్రావణాన్ని తాగించారు. ఈ సందర్భంగా చౌట్ పల్లి పశువైద్యాధికారి డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందును ప్రతి నాలుగు నెలలకు ఒకసారి తప్పనిసరిగా వేయించాలన్నారు. తద్వారా పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా 1350 గొర్లు, మేకలకు నట్టల నివారణ ద్రావణాన్ని తాగించినట్లు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ గొర్ల సంఘం అధ్యక్షులు జక్కుల రాజన్న, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కే. భూమేష్, పశు వైద్య సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ సత్యం, గోపాలమిత్ర స్పరన్, రాజ్, పసుమిత్ర లక్ష్మి, గోర్లు మేకల కాపలదారులు తదితరులు పాల్గొన్నారు.
పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



