Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారుల నిర్లక్ష్యంతో 100% లక్ష్యానికి దూరమైన బెస్ట్‌ అవైలబుల్‌ విద్య... 

అధికారుల నిర్లక్ష్యంతో 100% లక్ష్యానికి దూరమైన బెస్ట్‌ అవైలబుల్‌ విద్య… 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
బెస్ట్ అవైలబుల్ పథకానికి అర్హులైన విద్యార్థులను ఎంపీక చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారుల విముఖత,ధరాఖాస్తు పరిశీలినలో ఆలస్యం, సీట్ల కేటాయింపులో అనవసర జాప్యం, పర్యవేక్షణ లోపం బాధ్యత తీసుకునే అధికారుల లేమి వంటి కారణాల వల్ల అనేకమంది బెస్ట్ అవైలబుల్ పథక ప్రయోజనాన్ని  కోల్పోయారని మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన సమాన విద్య హక్కుకు విరుద్ధమని ఈ విద్యా సంవత్సరంలో నష్టపోయిన పిల్లల విషయంపై ఆన్లైన్ లో మెయిల్ ద్వారా బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్  సంబంధించిన మంత్రికి పిర్యాదు చేసినట్లు తెలిపారు.

పేద విద్యార్థులకు ప్రైవేట్‌ విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన బెస్ట్‌ అవైలబుల్‌ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు ఎస్సీ వెల్ఫేర్  అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోవడంతో ఎస్సీ కులానికి చెందిన పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన పేద విద్యార్థులను ఎంపిక చేసిన ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అయితే ఈ పథకం ద్వారా అర్హులైన వారికి  ఆయా ప్రైవేట్‌ పాఠశాలలకు ఎంపిక చేసి పాఠశాలకు పంపవల్సి ఉంటుందన్నారు. అయితే 2025/ 26 సంవత్సరానికి సంబంధించి సీట్లు భర్తీ కాకుండా అలాగే మిగిలిపోవడంతో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను ఎంపిక చేసి ప్రొసీడింగ్ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే సైతం లెటర్ ఇచ్చారన్నారు. అవన్నీ ఖాతరు చేయకుండా దరఖాస్తు పరిశీలనలో నిర్లక్ష్యం, సీట్ల కేటాయింపులో జాప్యం చేస్తూ బాధ్యత తీసుకోవలసిన అధికారులే  సంబంధం లేనట్టు వ్యవహరించరన్నారు. అర్హులైన విద్యార్థులకు ప్రస్తుత సంవత్సరం చదువుకు దూరం చేసినందుకు ఎస్సీ వెల్ఫర్ జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని  సంబంధించిన బెస్ట్ అవైలబుల్ పథకం అమలులో జరిగిన వైఫల్యం పై తక్షణమే స్వతంత్ర  విచారణ జరిపాలన్నారు. దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా స్పష్టమైన గడువులు, బాధితులు నిర్ణయించాలని   కోరారు. ఈ సమావేశంలో వికలాంగుల నాయకులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -