Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్లు,గ్రామాల అభివృద్ధే లక్ష్యం : మంత్రి

రోడ్లు,గ్రామాల అభివృద్ధే లక్ష్యం : మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ
రోడ్లు, గ్రామాలను అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నాంపల్లి మండలంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో మండలంలోని యరగండ్లపల్లి గ్రామ వద్ద కాసేపు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడిన సందర్భంగా ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేదకు అందేవిధంగా చూడాలన్నారు.పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ఒక యుద్ధ సైనికుడి ల పనిచేయాలని సూచించారు.మండలంలో రోడ్ల సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకువస్తే నిధులు మంజూరు చేయించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గిరిజన తండాలో కొత్తగా చౌక ధరల దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే వెంటనే మంజూరు చేయిస్తానన్నారు.రాజకీయంలో గెలుపోటములు సహజమని మనోధైర్యంతో ముందుకు సాగితే పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని యరగండ్లపల్లి కంటెస్టెంట్ సర్పంచ్ పులిమామిడి నర్సిరెడ్డి కి  ఆయన మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, యరగండ్లపల్లి కంటెస్టెంట్ సర్పంచ్ పులిమామిడి నర్సిరెడ్డి మంత్రిని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏడు దొడ్ల కృష్ణారెడ్డి,మాల్ డైరెక్టర్ జమ్ముల వెంకటేశం,మాజీ ఉపసర్పంచ్ వనపర్తి యాదయ్య,ఆకారపు శ్రీను,సిలువేరు యాదయ్య,గాంధీ, వల్లంల శ్రీనివాస్,మామిడి అంజయ్య,నక్కర గోని కొండల్,గ్యార వెంకటేష్,కురంపల్లి నర్సింహా, నక్కరగోని స్వామి,మాడెం శంకర్,మాడెం రవి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -