– ఘనంగా ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సo
నవతెలంగాణ – అచ్చంపేట : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ( భారత విద్యార్థి ఫెడరేషన్) అలుపెరుగని పోరాటాలు చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అన్నారు. బుధవారం ఎస్ఎఫ్ఐ అచ్చంపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు విద్యార్థుల సంరక్షణ కోసం విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేసేది దేశంలో రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ అని గుర్తు చేశారు. విద్యార్థికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎస్ఎఫ్ఐ ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడం కోసం, స్కాలర్షిప్లబ్ సమస్యలపై విద్యారంగ సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు. ఎస్ఎఫ్ఐలో విద్యార్థులు సభ్యులుగా చేరాలని సభ్యత్వం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ కార్యదర్శి పరమేష్, డివిజన్ అధ్యక్షులు, సంతోష్, డివిజన్ కమిటీ సభ్యులు విద్యార్థిని, విద్యార్థులు పాగొన్నారు.
విద్యార్థుల సమస్యల కోసం ఎస్ఎఫ్ఐ అలుపెరగని పోరాటం చేస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



