నవతెలంగాణ – ఊరుకొండ
కష్టాల్లో ఉన్న కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు సిఐటియు ఎల్లవేళలా అండగా ఉంటుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు అన్నారు. బుధవారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేట శివారులో గల సూర్యలత స్పిన్నింగ్ కాటన్ మిల్ కార్మికులు గత ఐదు రోజులుగా తమ విధులు బహిష్కరించి గేటు ముందు ధర్నా చేస్తుంటే.. సూర్యలత కాటన్ మిల్ యాజమాన్యం పట్టించుకోవడంలేదని.. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. సూర్యలత స్పిన్నింగ్ కాటన్ మిల్ వర్కర్స్ చేపట్టిన ఐదవ రోజు సమ్మె సందర్భంగా ధర్నాలో పాల్గొని సీఐటీయూ జిల్లా కమిటీ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింత ఆంజనేయులు కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. పరశురాములు సీపీఐ(ఎం) నాయకులు ఏపీ.మల్లయ్య పాల్గొని మద్దతు తెలిపి మాట్లాడుతూ.. సూర్యలత స్పిన్నింగ్ కాటన్ మిల్ నెలకొల్పి 19 సంవత్సరాలు గడుస్తున్న అందులో కార్మిక సంఘం నెలకొల్పకుండా యాజమాన్యం అడ్డుకోవడం దుర్మార్గమైన విషయమని.. అదేవిధంగా పెరిగే ధరలకు అనుగుణంగా వారి జీతాలు పెంచకుండా ఆరు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ. నాలుగు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంటు.. పాత కాటన్ మిల్లులో జరిపి వేతనాలు చేయిస్తున్నప్పటికీ ఇందులో పెంచకపోవటం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా సినీయార్టీ ప్రకారం అందరినీ పర్మినెంట్ చేయాలని ఈఎస్ఐ చాలామందికి అమలు కావడం లేదు వారందరికీ ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని వారి న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. కార్యక్రమంలో మార్చాల సిపిఎం గ్రామ కార్యదర్శి రామకృష్ణ, మిల్లు వర్కర్స్ సంజీవ్ కుమార్, ఇందు వర్ధన్ రెడ్డి, రేణుక, లావణ్య, ఇందిరా, అనిత, అలివేలు, విమల, శ్రీశైలం, పురుషోత్తం, విశ్వంభర్, తదితరులు పాల్గొన్నారు.



