- Advertisement -
-ఎన్నో ఎళ్లుగా చీకట్లో మగ్గుతున్న ఎల్లమ్మ ఆలయ అవరణం
– సోలార్ లైట్ అమర్చిన వార్డ్ సభ్యుడు వెంకటేశ్
నవతెలంగాణ – బెజ్జంకి
పాలకులు మారుతూనే ఉన్నారు.ఎస్సీ కాలనీలోని ఎల్లమ్మ ఆలయం ఎన్నో ఎళ్లుగా చీకట్లోనే మగ్గుతుంది.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 9వ వార్డ్ సభ్యునిగా ఎన్నికైన ఎల్.వెంకటేశ్ సుమారు రూ.10 వేలు వెచ్చించి మంగళవారం సోలార్ లైట్ ఏర్పాటు చేసి ఎల్లమ్మ ఆలయ అవరణం వద్ద చీకటికి వెలుగులు నింపాడు.లైట్ ఏర్పాటు చేసిన వార్డ్ సభ్యుడు వెంకటేశ్ కు ఆలయ పరిసర ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



