Wednesday, December 31, 2025
E-PAPER
HomeNewsసహకార సంఘ అక్రమాలపై విచారణ

సహకార సంఘ అక్రమాలపై విచారణ

- Advertisement -

– తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీసీబీ సీఈఓ ఆదిత్య 
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై డీసీసీబీ సిఈఓ ఆదిత్య విచారణ జరిపారు. స్థానిక సహకార సంఘానికి బుధవారం వచ్చిన ఆయన సంఘ రికార్డులు సమగ్రంగా తనిఖీ జరిపారు. ఈ క్రమంలో ఒకే ఫోన్ నెంబర్ నలుగురైదుగురు రైతులు పేరున నమోదు అయి ఉండటం గమనించారు.ఏమిటి మతలబు అంటూ మండిపడ్డారు.ఆయన సమక్షంలోనే ఓ మహిళా రైతు కు ఇంచార్జి సీఈఓ హేమగిరి తో ఫోన్ చేసింది మాట్లాడించారు. ఆమె ఇచ్చిన సమాధానంతో సిబ్బంది నిర్వాకం పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహణ, ఇచ్చిన రుణాలు ఎన్ని,వసూలు చేసింది ఎంతో? ఉన్న బాకీలు సంగతి ఏమిటి? 3 శాతం వడ్డీ రాయితీ ఎంతమంది పొందారు, ఎంతమందికి ముందస్తు సమాచారం అందించారు. మొదలగు వివరాలపై ఆరాతీశారు.  అశ్వారావుపేట సహకార సంఘంలో రూ.1.69కోట్లు అక్రమాలు జరిగాయని ఆరోపణలపై కొంతకాలంగా విచారణ జరుగుతున్న విషయం విదితమే.ధాన్యం కొనుగోళ్లలో జరిగిన రూ.6 కోట్ల లావాదేవీల పైనా సమగ్ర విచారణ జరపాలని మాజీ డైరెక్టరు బత్తిన పార్థసారథి విజ్ఞప్తి చేశారు.  ఈ క్రమంలో ఆదిత్య మాట్లాడుతూ ప్రతి పది రోజులకోసారి ఎన్ని రుణాలు వసూలు చేశారు. ఎంత వడ్డీ రాయితీ చెల్లించారు, మొదలగు వివరాలన్నీ పంపాలని డీసీసీబీ బ్యాంకు మేనేజర్ అనూష, సిబ్బందిని ఆదేశించారు. సహకార సంఘాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట డీజీఎం వేణుగోపాల్, స్థానిక సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -