నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మార్కెట్ యార్డులో మద్దతు ధరతో కొనుగోలు జరుగుతున్న సోయా పంట తూకంలో అమాలీలు మాత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని సోయా పంట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ అధికారుల దృష్టికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ దృష్టికి వెళ్ళింది. ఈ విషయంపై మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ అధికారులను ఆదేశిస్తూ మాత్రాల పేరుతో రైతులకు హమాలీలు మోసగించే వాటి పట్ల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల వద్ద నుండి కిలోల కొద్దీ సోయా పంట మాత్ర పేరుతో మోసాలకు పాల్పడుతున్న దృశ్యాలను మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ సెల్ ద్వారా ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని రైతులు నవ తెలంగాణ దృష్టికి తీసుకురాగా మాత్ర పేరుతో మోసగించే సోయా పంట సంచులను ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నవ తెలంగాణ మార్కెట్ కమిటీ సూపర్వైజర్ల దృష్టికి తీసుకుపోగా రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అక్కడే ఉన్న చైర్మన్ సౌజన్య రమేష్ ఈ విషయంపై చర్చిస్తామని అమాలీల మోసాలపై చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశిస్తామని తెలిపారు.
సోయా కొనుగోళ్లలో మాత్ర పేరుతో అమాలీల మోసాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



