నవతెలంగాణ – ఆర్మూర్
రాబోయే మున్సిపల్ ఎన్నికల, ఓటర్ల విభజన వార్డ్ ల విభజన సరిగా లేదని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో సరిగ్గా సిద్ధం చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పాలెపురాజు, పట్టణ అధ్యక్షులు మందుల బాలు లు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రావణి కి వినతి పత్రం అందజేసినారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళ పేర్లు , పెళ్లయిన వాళ్లు ,వేరే ఊర్లకు స్థిర నివాసం చేసుకున్న వాళ్లు వారి ఓట్లను వెంటనే తొలగించాలని కొత్తగా వచ్చే ఓట్లను బిఎల్ఎ కు చెప్పి వెరిఫికేషన్ చేపించాలని కోరడం జరుగుతుంది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి పోల్కం వేణు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచేటి గంగాధర్. సీనియర్ నాయకులు ఆకుల శీను, సుంకరి రంగన్న, జాగిర్ధర్ శీను, ప్రధాన కార్యదర్శి ఖండేశ్ ప్రశాంత్, ఉపాధ్యక్షులు బాండ్లపల్లి నర్సారెడ్డి, పోచంపాటి శ్రీను, కార్యదర్శి కుమార్, బాశెట్టి రాజ్ కుమార్, దళిత మోర్చా అధ్యక్షులు శేఖర్, బీజేవైఎం అధ్యక్షులు ఉదయ గౌడ్ బీజేవైఎం అధ్యక్షులు ఉదయ్ గౌడ్, కుక్కునూరు లింగన్న, విజయ్ ఆనంద్, మిరియాల కిరణ్, చిట్టి బాజన్న తదితరులు పాల్గొన్నారు.



