- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బీఎన్ తిమ్మాపురం గ్రామంలో భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ వార్డు సభ్యులు మాజీ పాలసంగం చైర్మన్ జిన్న నర్సింహ గురుస్వామి నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ అయ్యప్పస్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో గత 41 రోజులుగా అయ్యప్ప స్వామి కఠోర దీక్షను చేపట్టి మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని శబరిమలై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమల వెళ్తున్న అయ్యప్పస్వాములు మీయొక్క యాత్రను క్షేమంగా పూర్తి చేసుకుని రావాలని కోరారు.
- Advertisement -


