- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందులను గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోషా శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నట్టల మందులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గొర్రెలకు ఎలాంటి వ్యాధులు సోకిన వెంటనే వెటర్నరీ డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారి దుర్గమ్మ, గొర్రెల మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.
- Advertisement -



