- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్: బజార్ హత్నూర్ నుంచి చింతలసాంగ్వి మీదుగా మోర్కండి వెళ్ళే రోడ్డు కు చింతల సాంగ్వీ గ్రామ సమీపంలో సెల్ టవర్ వద్ద ముల మలుపులో పెరిగిన పిచ్చి మోక్కలను ఆదివాసీ యువజన సంఘం చింతల సాంగ్వీ గ్రామ యువకులు శ్రమదానం చేసి తొలగించారు. ఇక్కడి మూలమలపుల వద్ద తరుచుగా వాహనాలకు ప్రమాదాలు జరగడంతో రాకపోకలకు చాలా ఇబ్బంగా మారడం చూసిన ఆదివాసీ యుత్ సభ్యలు పిచ్చి మోక్కలను తొలగించారు. ఇక్కడున్న సూచిక బోర్డును కూడా సరి చేశారు. దీంతో వాహనదారుల ఇబ్బందులు దూరమైయాయని ఆదివాసీ యూత్ అధ్యక్షులు సిడాం శుభాష్ అన్నారు. యూత్ సభ్యులు చేసిన ఈ మంచి పనికి పలువురు అభినందించారు.
- Advertisement -



