- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని పెద్దాపూర్ గ్రామ పరిధిలోని దుందుభి వాగు నుంచి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను బుధవారం తాహసిల్దార్ అద్దంకి సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు 350కి పైగా ఇసుక డంపులను సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో తాహసిల్దార్ వెంట గిర్దావరి రామకృష్ణ, జీపీఓ, అటెండర్ శ్రీను పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక నిల్వ చేసి రవాణా చేస్తున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భూగర్భ జలాలు, పర్యావరణానికి నష్టం కలిగించే అక్రమ ఇసుక రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
- Advertisement -



