Thursday, January 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'గత వైభవం'కి అద్భుతమైన రెస్పాన్స్‌

‘గత వైభవం’కి అద్భుతమైన రెస్పాన్స్‌

- Advertisement -

ఫాంటసీ విజువల్‌ వండర్‌ ‘గత వైభవం’ గత నెలలో కర్నాటక వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎస్‌ఎస్‌ దుష్యంత్‌, ఆషిక రంగనాథ్‌ నటించిన ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించడమే కాకుండా, దీపక్‌ తిమ్మప్పతో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. సర్వేగర సిల్వర్‌ స్క్రీన్స్‌తో కలిసి సునీ సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు గ్రాండ్‌గా తెలుగులో విడుదల కానుంది. కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నేతత్వంలోని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఈ చిత్రాన్ని నేడు (గురువారం) తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనుంది. ప్రీమియర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎస్‌ఎస్‌ దుష్యంత్‌ మాట్లాడుతూ,’మా ట్రైలర్‌ని లాంచ్‌ చేసిన నాగార్జునకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన మాపై ఎంతో ప్రేమను చూపించారు. ఈ సినిమా కన్నడలో సూపర్‌ రెస్పాన్స్‌ని అందుకుంది. అదే నమ్మకంతో తెలుగులో జనవరి 1న రిలీజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్స్‌ వేసాము.

మేము ఊహించిన దాని కంటే అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మీరు సినిమా చూసినప్పుడు ఒరిజినల్‌ తెలుగు సినిమాలాగే అనిపిస్తుంది. ప్రతిదీ డీటెయిల్డ్‌గా డబ్‌ చేశాం. గత వైభవం ఐదేళ్ల జర్నీ. బెంగళూరు, మైసూర్‌ పోర్చుగల్‌ ఇలా అనేక ప్రదేశాల్లో షూటింగ్‌ చేశాము. ఫస్ట్‌ హాఫ్‌ ఫన్‌ రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా ఉంటుంది. సెకండాఫ్‌ అద్భుతమైన ఎమోషన్స్‌ ఉంటాయి. ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న నిరంజన్‌ రెడ్డికి థాంక్యూ. అలాగే బెక్కం వేణుగోపాల్‌కి కృతజ్ఞతలు’ అని తెలిపారు. ‘ఈ సినిమాకి కన్నడలో సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేయాలని మేము ఎంతో ఆసక్తిగా చూస్తున్నాం. వరంగల్‌, హైదరాబాదులో ప్రీమియర్స్‌ వేసాం. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తెలుగు ఆడియన్స్‌తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. మేము ఊహించి దాని కంటే చాలా గొప్ప రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాకి ఆడియన్స్‌ చాలా బాగా కనెక్ట్‌ అవుతున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్‌ ఖాయం’ అని కథానాయిక ఆషికా రంగనాథ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -