Thursday, January 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త అనుభూతినిచ్చే సినిమా

సరికొత్త అనుభూతినిచ్చే సినిమా

- Advertisement -

హీరో శ్రీ నందు నటించిన తాజా చిత్రం ‘సైక్‌ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా బ్యాకింగ్‌తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్‌ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్‌, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు (గురువారం) గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీ నందు మీడియాతో ముచ్చటించారు. డల్లాస్‌లో స్పెషల్‌ స్క్రీనింగ్‌ హౌస్‌ ఫుల్‌ షో పడింది. అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అందుకే చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉంది. 18 ఏళ్ల నా కెరీర్‌లో చాలా సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కథ ఇలా ఉంటే బాగుండేది కదా.. అనిపించేది కానీ నాకు చెప్పడానికి ఆస్కారం లేదు. నా జడ్జిమెంట్‌ కరెక్టా, రాంగా అని తెలుసుకోవడానికి నేనొక ప్రయత్నం చేయాలనుకున్నాను. అలా నా జడ్జిమెంట్‌ని నమ్మి ఒక డైరెక్టర్‌ణి, కథని నమ్మి చేసినా సినిమా ఇది.

ఒక ఫైనల్‌ డెస్టినేషన్‌లాగా పెట్టుకుని వచ్చాను. సురేష్‌ బాబు మమ్మల్ని బిలీవ్‌ చేయడంతోనే మేము 90% గెలిచేసినట్టు. అక్కడే నా జడ్జిమెంట్‌ రైట్‌ అనిపించింది. ‘దండోరా’ స్క్రిప్ట్‌ వినగానే చాలా నచ్చింది. ఆ సినిమాలో నా నటనకు చాలా మంచి అప్రిషియేషన్స్‌ వచ్చాయి. ఒక అబ్బాయి జీవితంలోకి అమ్మాయి రావడంతో మోసపోతాడు. అదే అబ్బాయి జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో బాగుపడతాడు. కథగా చెప్పుకుంటే ఇంత సింపుల్‌గా ఉంటుంది. కానీ ఈ కథని ప్రజెంట్‌ చేసిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్‌ స్క్రీన్‌ ప్లే, ఒక న్యూ ఏజ్‌ ఫిలిం మేకింగ్‌తో వస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఆడియన్స్‌ ఇప్పటివరకు ఎన్నడూ చూడని ఎడిటింగ్‌ పాటర్న్‌ ఇందులో కనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ కొత్తగా ఉంటుంది. జెన్జీ ఆడియన్స్‌కి బాగా నచ్చ్తుంది. సెకండ్‌ హాఫ్‌ అందరికీ యునానిమస్‌గా నచ్చుతుంది. ఈ కథలో చాలా మూస పద్ధతుల్ని బ్రేక్‌ చేశాం. ఫస్ట్‌ హాఫ్‌ నిజంగా చెప్పాలంటే ఒక వీడియో గేమ్‌ చూసినట్టుగా ఉంటుంది. ఫస్టాఫ్‌ అర్థమైన వాళ్ళు జీవితాంతం ఆ ఫస్టాఫ్‌ గురించే మాట్లాడుతూ ఉంటారు. సెకండ్‌ హాఫ్‌ చాలా ఎమోషనల్‌గా ఆడియన్స్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. హీరోయిన్‌ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. కంటెంట్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -