Thursday, January 1, 2026
E-PAPER
Homeసినిమా100 మిలియన్లకి పైగా..

100 మిలియన్లకి పైగా..

- Advertisement -

మ్యూజిక్‌ ప్రేక్షకుల మనసులను తాకితే ఆ సినిమా హైప్‌ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుంది. హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ అదే విషయాన్ని నిరూపించింది. ఇప్పటికే ఈ చిత్రం చార్ట్‌బస్టర్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌తో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘మీసాల పిల్ల’ ఇప్పుడు అధికారికంగా 100 మిలియన్ల వ్యూస్‌ మార్కును దాటింది. 2025లో బిగ్గెస్ట్‌ తెలుగు చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన ‘మీసాల పిల్ల’లో నోస్టాల్జిక్‌ ఫీల్‌కు మోడ్రన్‌ ఎనర్జీని అద్భుతంగా మేళవించారు. ఉదిత్‌ నారాయణ్‌, శ్వేతా మోహన్‌ల వోకల్స్‌ పాటకు క్లాసిక్‌ టచ్‌ ఇవ్వగా, చిరంజీవి, నయనతారల మధ్య కనిపించే కెమిస్ట్రీ విజువల్‌ ట్రీట్‌గా నిలిచింది. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఈ పాట ప్రేక్షకులను కట్టి పడేసింది.

ఈ పాటను నిజంగా బ్లాక్‌బస్టర్‌ స్థాయికి తీసుకెళ్లింది చిరంజీవి స్క్రీన్‌ ప్రెజెన్స్‌. ఆయన స్టైల్‌, గ్రేస్‌, సిగేచర్‌ డాన్స్‌ మూమెంట్స్‌ అభిమానులని మెస్మరైజ్‌ చేశాయి. ఇదే జోరును కొనసాగిస్తూ విడుదలైన రెండో సింగిల్‌ ‘శశిరేఖ’ కూడా వేగంగా 35 మిలియన్‌ వ్యూస్‌ దాటింది. తాజాగా విడుదలైన మూడో సింగిల్‌ ‘మెగా విక్టరీ మాస్‌’ హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. చిరంజీవి, వెంకటేష్‌ కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసిన ఈ హై-వోల్టేజ్‌ సాంగ్‌ విడుదలైన రోజే వైరల్‌గా మారి, ప్లేలిస్టులు, రీల్స్‌, ఫెస్టివల్‌ సెలబ్రేషన్స్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ పాట దాదాపు 8 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుని న్యూఇయర్‌, సంక్రాంతి వేడుకలకు ఫేవరెట్‌ నెంబర్‌గా మారింది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -