రూ.18లక్షలతో కనీస ధరతో నమోదు
మహిళల కేటగిరిలో రూ.10లక్షలకు అంతిమ్
3న ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం
15నుంచి టోర్నీ ప్రారంభం
ముంబయి: పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ ప్రొ రెజ్లింగ్ వేలం రేసులో నిలిచాడు. అతడు కనీస ధర రూ.18లక్షలతో వేలం రేసులో ఉన్నాడు. దీంతో అతడు అత్యంత ఖరీదైన దేశీయ ఆటగాడిగా బేస్ ప్రైజ్ రేసులో నిలిచాడు. ఇక రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత యుయ్ సుసాకీ, యుస్నీ లీస్ గుజ్మాన్ లోపెజ్ కూడా ఈసారి జరిగే రెజ్లింగ్ వేలం రేసులో ఉన్నాడు. ప్రొ రెజ్లింగ్ వేలం జనవరి 3న జరగనుండగా.. ఆటగాళ్లను కొనుగోలు చేసుకొనేందుకు ఆరు ఫ్రాంచైజీలు మెగా వేలంలో పాల్గోనున్నాయి. ఒక ప్రొ రెజ్లింగ్ టోర్నమెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరగనుంది. రాబోయే సీజన్‌లో హర్యానా థండర్స్, టైగర్స్ ఆఫ్ ముంబై దంగల్స్, పంజాబ్ రాయల్స్, మహారాష్ట్ర కేసరి, ఢిల్లీ దంగల్ వారియర్స్ మరియు యుపి డామినేటర్స్ ప్రాంచైజీలు రెజ్లింగ్ టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అధిక బరువుతో భారత రెజ్లింగ్ సమాఖ్య నిషేధం విధించగా.. ఆ నిషేధం తాజాగా ముగిసింది. అమన్ ఇటీవలికాలంలో సంచలన విజయాలు, అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లోనూ అమన్ పతకాలు కొల్లగొట్టాడు. కామన్వెల్ క్రీడల పతక విజేత దీపక్ పునియా, నవీన్ రూ.10లక్షల బేస్ ధరతో వేలం రేసులో నిలువగా.. అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరైన సుజీత్ కల్కల్ రూ.7లక్షలతో కనీస ధరతో వేలం బరిలో దిగాలని నిర్ణయించుకున్నాడు. భారత్ వేదికగా జరిగే ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో విదేశీ రెజ్లర్లదే హవా. మాజీ ప్రపంచ, యూరోపియన్ ఛాంపియన్, రష్యాకు చెందిన అబాస్గిడ్జి మాగోమెడోవ్ రూ.10లక్షల కనీస ధరతో, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఆర్మేనియాకు చెందిన అర్మాన్ ఆండ్రియాస్యున్, పారిస్ ఒలింపిక్స్‌లో 5వ స్థానంలో నిలిచిన, 2023 ప్రపంచ ఛాంపియన్, హంగేరీకి చెందిన ఇజ్మాయిల్ కూడా రూ.10ల బేస్ ధరతోనే వేలం బరిలో దిగనున్నారు.
ఇక మహిళల విభాగంలో అంతిమ్ పంగల్ రూ.10లక్షల బేస్ ధరతో వేలం రేసులో నిలిచింది. దీంతో ఈ విభాగంలో భారత్ తరఫున అత్యధిక బేస్ ధరతో రిజిస్ట్రర్ చేసుకున్న తొలి రెజ్లర్‌గా అంతిమ్ పంగల్ నిలిచింది. ఇక ఆషూ మాలిక్, జాతీయ ఛాంపియన్ సృతి షిండే రూ.10లక్షల బేస్ ధరతో వేలం బరిలో దిగనుండగా.. ఒలింపిక్ ఛాంపియన్, జపాన్‌కు చెందిన యూ రూ.18లక్షలతో వేలం బరిలో దిగుతోంది. క్యూబా, ఉక్రెయిన్, అజర్‌బైజాన్, రష్యా రెజ్లర్లు కూడా భారత్ వేదికగా జరిగే ప్రొ రెజ్లింగ్ వేలం కోసం రిజిస్ట్రర్ చేయించుకున్నారు. వీరంతా కనీస ధర రూ.5లక్షల నుంచి 10 లక్షలలోపు రిజిస్టర్ చేయించుకున్నారు.



