మహాన్, శృతి, మోహనసిద్ధి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సిద్ధుగాడి లవ్‌స్టోరీ’. బాల బ్రహ్మచారి సమర్పణలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై సి.సావిత్రమ్మ నిర్మిస్తున్నారు.
సి.రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం ఈచిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’దర్శకుడు కావాలనే తన కొడుకు రమేష్ కలను ఈ సినిమాతో సావిత్రమ్మ నిజం చేశారు. యుఎస్‌లో రమేష్ తన ప్రొఫెషనల్ కెరీర్‌ను కంటిన్యూ చేస్తూ ఇక్కడికి వచ్చి సినిమాని కంప్లీట్ చేయటం అభినందనీయం. సిద్ధు సిద్ధార్థారాయ్ లవ్‌స్టోరీని ‘ఖుషి’ సినిమాలో చూసి హిట్ చేశాం. అలాగే ఈ సినిమాని కూడా ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నా. ఇందులోని పాటలు చాలా బాగున్నాయి’ అని అన్నారు.
హీరో మహాన్ మాట్లాడుతూ,’మా సినిమాలో పాటలు, ఫైట్స్ అందర్నీ అలరిస్తాయి. అన్నింటికిమించి ఇందులో ప్రేమకథతోపాటు మంచి సందేశం కూడా ఉంది’ అని చెప్పారు. హీరోయిన్ మోహనసిద్ధి మాట్లాడుతూ,’తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా తక్కువ. నాకు ఈ సినిమా ద్వారా ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు రమేష్‌కి థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు సోలో సాంగ్ ఉంటుంది. ఆ పాట నేచర్ గురించి రూపొందించారు. హీరోయిన్గా నాకు మరిన్ని అవకాశాలను తీసుకొచ్చే సినిమా ఇది’ అని తెలిపారు. ‘ఒక మంచి ప్రేమకథా చిత్రంగా మా సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను’ అని మరో నాయిక శృతి చెప్పారు. సంగీత దర్శకుడు అధిరవ్ కృష్ణ మాట్లాడుతూ,’ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ చాలా బాగా కుదిరాయి. మా మూవీ ఆల్బమ్ మంచి అవుతుందనే నమ్మకం ఉంది. అలాగే సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటుందనే నమ్ముతున్నాం’ అని తెలిపారు.
సరికొత్త ప్రేమకథా చిత్రం
- Advertisement -
- Advertisement -



