Thursday, January 1, 2026
E-PAPER
Homeసినిమా'బిగ్‌ బాస్‌' నాకు ఎంతో ఇచ్చాడు

‘బిగ్‌ బాస్‌’ నాకు ఎంతో ఇచ్చాడు

- Advertisement -

‘బిగ్‌ బాస్‌’ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని నటుడు ఇమ్మాన్యుల్‌ అన్నారు. ‘జబర్దస్త్‌’తో కోట్లాదిమంది అభిమానాన్ని గెలుచుకున్న ఆయన బిగ్‌ బాస్‌లోనూ తనదైన శైలిలో అలరించి టాప్‌ 4 ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. బిగ్‌ బాస్‌ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు. అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపారు. బిగ్‌ బాస్‌లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు. బిగ్‌ బాస్‌ జర్నీలో తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ‘విజనరీ వౌస్‌’కి కృతజ్ఞతలు తెలిపారు. బిగ్‌ బాస్‌ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్‌లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని, బిగ్‌ బాస్‌ విజేతగా నిలిచిన కల్యాణ్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన ఇమ్మాన్యూల్‌ తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -