టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. నేడు (గురువారం) ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దర్శకుడు మెహర్ రమేష్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ,”రాజు సత్యం నాకు చాలా మంచి స్నేహితుడు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్‌తో నేను చేసిన ‘వీర కన్నడిగ’ చిత్రంలో నటించాడు. అప్పటి నుంచి మా స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన ఇప్పుడు ఈ మూవీని నిర్మించారు. ట్రైలర్ చూశాను. నాకెంతో గ్రిప్పింగ్‌గా అనిపించింది.
పూరి చిత్రాల్లో రాజ్ నటించాడు. ఇప్పుడు ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. బాలీవుడ్ అంతా కదిలి వచ్చి ఈ చిత్రం కోసం సపోర్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మరాఠీ ప్రేక్షకులకు కూడా స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడి వారంతా ఈ మూవీని చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు. ‘హైదరాబాద్‌లో చాలా మంది మరాఠీలు నివసిస్తున్నారు. అరుణ్ సహకారంతో ఈ మూవీని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. రవింద్ర చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ కథను ఏ భాషలో తీయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఈ మూవీని మరాఠీలోనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌గా తీయాలని అనుకున్నాను. జితేంద్ర జోషి అద్భుతంగా నటించారు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీని రానున్న 20 ఏళ్లు ఏలుతాడని నాకు అనిపించింది. మరాఠీలో, హైదరాబాద్‌లో మా చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని నిర్మాత రాజు సత్యం చెప్పారు.
సర్‌ప్రైజ్ చేసే’మ్యాజిక్’
- Advertisement -
- Advertisement -



