Thursday, January 1, 2026
E-PAPER
Homeసినిమా'ఈషా' సక్సెస్‌తో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు

‘ఈషా’ సక్సెస్‌తో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు

- Advertisement -

కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ సమర్పణలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘ఈషా’. ఈ చిత్రంలో త్రిగుణ్‌, హెబ్బా పటేల్‌, అఖిల్‌ రాజ్‌, సిరి హన్మంత్‌, పథ్వీరాజ్‌ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిర్మాత సురేష్‌ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మా దాముని ఫిల్మ్‌ ఛాంబర్‌ పనులు చూసుకోమని ఇటు సైడ్‌ పంపించాం. ఆ బాధ్యతలన్నీ కూడా దాము ఎంతో సమర్థవంతంగా చూసుకుంటున్నారు. మళ్లీ ఇలా ఆయన ‘ఈషా’తో ఆడియెన్స్‌ ముందుకు రావడం ఆనందంగా ఉంది.

ఆడియెన్స్‌ ముందుకు తీసుకువచ్చి హిట్‌ చేసిన బన్నీ వాస్‌, నంది వంశిపాటికి కంగ్రాట్స్‌. నిజాయితీతో సినిమా తీస్తే హిట్‌ చేస్తామని ఆడియెన్స్‌ మరోసారి నిరూపించారు. చిన్నసినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. కంటెంట్‌ బాగుంటే సినిమా ఆడుతుంది. కంటెంట్‌ ఉన్న చిత్రాలనే ఆడియెన్స్‌ చూస్తారు. ఆడియెన్స్‌ పెట్టే డబ్బులు, వెచ్చించే సమయానికి తగ్గ కంటెంట్‌ను మనం ఇస్తున్నామా? లేదా? అన్నది చూసుకోవాలి. దాముకి హిట్‌ రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ‘బన్నీ వాస్‌, వంశీలకు దిష్టి తీయాలి. పిలిచిన వెంటనే వచ్చిన నా స్నేహితులు సురేష్‌, అశోక్‌లకు థ్యాంక్స్‌. అల్లు అరవింద్‌ ఇచ్చే ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఏడాదిలో చిన్న చిత్రాలుగా వచ్చి హిట్టు కొట్టిన వారిని పిలవాలని అనుకున్నాను. అసలు సినిమాల్లో చిన్నా, పెద్ద అన్నది లేదు. ఏది ఆడితే అది పెద్ద సినిమా. ఆడకపోతే చిన్న చిత్రం. ‘ఈషా’ జర్నీ చాలా పెద్దది.

ఈ ప్రయాణంలో శ్రీనివాస్‌ చాలా కష్టపడ్డాడు. గత 15 ఏళ్లుగా అతడి జర్నీని నేను చూస్తున్నాను. శ్రీను తనని తాను నిరూపించుకున్నాడు. ఇక నుంచి శ్రీను వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాకూడదు. సహనంతో ఉంటే ప్రతీ ఒక్కరికీ విజయం దక్కుతుంది’ అని కెఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ చెప్పారు. బన్నీ వాస్‌ మాట్లాడుతూ, ‘ఈ మూవీతో మా దాముకి మంచి విజయం దక్కడం ఆనందంగా ఉంది. గత ఆరేళ్లుగా ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యల్ని ఆయన పరిష్కరించారు. ఇప్పుడు ఆయనకు ఇలాంటి సక్సెస్‌ రావడం సంతోషంగా ఉంది. ఇకపై ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఎన్నో మాటల్ని, ఒడిదుడుకుల్ని దాటుకుని ఈ సినిమా ఇంత వరకు వచ్చింది. అందుకే సక్సెస్‌ బియాండ్‌ నాయిస్‌ అని పెట్టాం. శ్రీనివాస్‌ అప్పుడు ‘కథ’, ఇప్పుడు ‘ఈషా’తో విజయం సాధించారు. దాము వల్లే ఈ సినిమా మా వరకు వచ్చింది’ అని వంశీ నందిపాటి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -