Thursday, January 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయువతిపై కారులో... ఇద్దరి అరెస్టు

యువతిపై కారులో… ఇద్దరి అరెస్టు

- Advertisement -

ఫరీదాబాద్‌ : గుర్‌గావ్‌-ఫరీదాబాద్‌ రోడ్‌పై వెళుతూ ఇద్దరు వ్యక్తులు కార్లోనే ఒక మహిళపై లైంగికదాడికి పాల్పడి అనంతరం బయటకు తోసేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళకు 12 కుట్లు పడ్డాయని, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి యూపీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. బస్సు కోసం ఆమె ఎదురు చూస్తుండగా లిఫ్ట్‌ ఇస్తామని వారు మారుతి సుజుకి ఇకో కారు ఎక్కించుకుని, దాదాపు మూడు గంటల పాటు ఆ యువతి (25)ని బందీగా వుంచారని ఫరీదాబాద్‌ పోలీసులు తెలిపారు.
బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదైంది. ఇంట్లో తల్లితో గొడవ పడిన ఆ యువతి స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణానికి గురైంది. కొద్దికాలంగా ఆమె తన భర్త నుండి వేరుగా జీవిస్తోంది. దట్టమైన పొగమంచు వల్ల ఏమీ కనిపించని వాతావరణంలో నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళిన వారు కారులోనే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత తెల్లవారు జామున 3-4 గంటల సమయంలో కారులో నుండి తోసేశారని, ఆమెకు ముఖంపై, తలపై తీవ్రంగా గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మంగళవారం ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -